Home కుమ్రం భీం ఆసిఫాబాద్ పాదయాత్ర టూ ప్రగతి భవన్ పోస్టర్ల ఆవిష్కరణ

పాదయాత్ర టూ ప్రగతి భవన్ పోస్టర్ల ఆవిష్కరణ

poster

మన తెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్ :  ఆసిఫాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో గురువారం సీపీఎస్ ఉపాధ్యాయులు పాదయాత్ర టు ప్రగతి భవన్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ సీపీఎస్‌ను ప్రభుత్వం రద్దుచేయాలని, ఉపాధ్యాయులకు ఇబ్బందులు కల్గకుండా చూడాలని వారు కోరారు. అలాగే సీపీఎస్ రద్దుకోసమే రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు వారు తెలిపారు.  ఈనెల 18న చేపట్టే పాదయాత్రను ఉపాధ్యాయులందరూ జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమిల, సీపీఎస్ ఉపాధ్యాయులు రాజేశం, సంతోష్‌కుమార్, శ్రీనివాస్, సదాశివ్, సురేష్, మహేశ్వర్, సరిత, తదితరులు పాల్గొన్నారు.