Search
Wednesday 18 July 2018
  • :
  • :

త్వరలోనే సొంతింటి కల సాకారం

Padma Devender Reddy Speech About Double Bedroom Homes

పేదవారి ఇంటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం  ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందని ఉప సభాపతి ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గం లో 2,400 డబుల్ బెడ్‌రూంల నిర్మాణం చేపడుతున్నామని, వాటిని త్వరితగతిన పూర్తిచేసి పేదలకు అందిస్తామన్నారు. ఇసుక ప్రభుత్వ ఆస్తి అని, ఇళ్ల నిర్మాణానికి అందుబాటులో ఉ న్న ఇసుకను వినియోగించుకోవచ్చని అన్నా రు. పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుకను తరలిస్తే అడ్డుకోవద్దని సూచించారు. ప్రభుత్వం నిర్మిస్తు న్న ఇళ్ల నిర్మాణం పేర ఇసుకను అక్రమంగా తరలిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆపద్బాంధు పథకం కింద చిన్నశంకరంపేట మం డలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్దిదారులకు రూ.50 వేల చొప్పున చెక్కులను అందజేశారు. సురారాం గ్రామానికి లునావత్ జెమిని, మిర్జపల్లికి చెందిన గౌసియాబేగం, కళావతి, గవ్వలపల్లికి చెందిన తలారి లక్ష్మి, చందంపేటకు చెందిన లత, శంఖాపూర్‌కు చెందిన లావణ్యలకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ అశోక్, ఎఎం సీ చైర్మన్ క్రిష్ణారెడ్డి, కౌన్సిలర్ మల్లేశం, చిన్నశంకరంపేట టిఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రాజు, పట్టణ శాఖ అధ్యక్షులు రమేష్‌గౌడ్ ఉన్నారు.
రైల్వే పనుల పరిశీలన… మెదక్ – అక్కన్నపేట రైల్వే పనులు జరుగుతున్న నేపద్యంలో సోమవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందరెడ్డి పరిశీలించారు. పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం వెనక జరుగుతున్న రైల్వేస్టేషన్, బిడ్జీ పనులను పరిశీలించిన అధికారులతో వివరాలను తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు రైలు సౌకర్యాన్ని అందిందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

Comments

comments