Home మెదక్ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి

రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి

Padma-Devender-Reddy

డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా కేంద్రంలో ఇందిరాగాంధీ స్టేడియంలో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యురాలు, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్టేడియంలో ఒక మొక్కను నాటి పెరేడ్‌లో నిర్వహించిన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పెరేడ్‌లో మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ, హెల్త్‌మోబైల్, హరితహారం శకటాలను ప్రదర్శించారు. జిల్లాలోని స్వాతంత్య్ర సమరయోధులను శాలువాలతో ఘనంగా సత్కరించడంతో పాటు హరితమిత్ర ద్వారా జిల్లాకు వచ్చిన 7 అవార్డులతో పాటు ఒకొక్కరికి లక్ష రూపాయల నగదు ప్రదానం చేశారు. ప్రతిభ కనబర్చిన మిషన్ భగీరథ డిప్యూటీ ఇఇ దినేష్‌కుమార్, కలెక్టరేట్ ఆర్‌ఐ మదన్‌లాల్‌కు రాష్ట్ర స్థాయి ప్రశంసా పత్రాలు అందజేయడంతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు జిల్లా స్థాయి ప్రశంసాపత్రాలను డిప్యూటిస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మెదక్ జిల్లాలో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం సంతోష దాయకమన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగఫలమే నేడు మనం పీలుస్తున్న ఈ స్వేచ్ఛా వాయువు అన్నారు. మిషన్‌కాకతీయ ద్వారా జిల్లాలో మూడు విడతల్లో 1479 చెరువుల్లో 388 కోట్ల రూపాయలతో పునరుద్ద రించడం జరిగిందని, దీని ద్వారా 98,872 ఎకరాల విస్తీర్ణం సాగులోకి వచ్చింద న్నారు. త్వరలో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఐసియు, డయాల్సిస్ సెంటర్, రక్తనిధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంసిద్దమవుతుందన్నారు. ఆసుపత్రి స్థాయికి తగ్గట్టుగా సిబ్బంది సౌకర్యాలు కల్పిస్తూ పిహెచ్‌సి సెంటర్లలలో 24 గంటలు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గొర్రెల పంపిణీ పథకానికి జిల్లాలో 20,182 కుటుంబాలను గుర్తించడం జరిగిందని, వీరికి 75 శాతం రాయితీతో గొర్రెలను పంపిణీ చేయడం జరుగుందన్నారు. ఇప్పటికే 1456 కుటుంబాలకు ఈ గొర్రెల పంపిణీ చేసి 7 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలను కూడా 75 శాతం సబ్సిడీపై అందించడం జరిగిందన్నారు.

మిషన్‌భగీరథ పథకం ద్వారా మొదటి విడుతలో 116.15 కోట్ల రూపాయలు ఆరు మండలలాకు మంజూరు కాగా ఇందులో తూప్రాన్, మనోహరాబాద్ పూర్తి చేయడం జరిగిందని, రెండవ విడుతలో 178.47 కోట్ల రూపాయలు 14 మండలాలకు మంజూరు కాగా పనులు ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రానికి శాశ్వత మంచినీటి పథకానికి 50 కోట్లు మంజూరు కావడం జరిగిందని, వచ్చే వేసవి నాటికి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తగ్గిపోతున్న అటవి విస్తీర్ణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా ఈ సంవత్సవం జిల్లాలో 1.18 కోట్లతో 150 నర్సరీల ద్వారా 148 లక్షల మొక్కలను లక్షం నిర్ధేశించుకున్నామని, ఇప్పటి వరకు 63.25 లక్షల మొక్కలను నాటడం కూడా జరిగిందన్నారు. జిల్లా కేంద్రాన్ని 2.25 కోట్లతో ఆదునిక హంగులతో రైతుబజార్ నిర్మాణ పనులు చేపట్టామని, త్వరలోనే తూప్రాన్‌లో కూడా రైతు బజార్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ భారతిహోళ్లికేరి, జిల్లా ఎస్పీ చందనాదీప్తితో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు, జిల్లాలో జడ్పిటిసీలు, ఎంపిటిసీలు, గ్రామ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు వివిధ వేషాదారణలతో దేశభక్తి గీతాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అకట్టుకున్నాయి.