Home మెదక్ తండాల అభివృద్ధికి కృషి

తండాల అభివృద్ధికి కృషి

 Working for the development of tands Padma devender

మన తెలంగాణ/మెదక్ టౌన్ : టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ తండాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామం నుండి తండా వరకు తారురోడ్డు నిర్మాణానికి ఎస్‌టి ప్లాన్ ద్వారా రూ.1.20 కోట్లను ఉపసభాపతి మంజూరు చేశారు. ఈ సందర్భంగా తండా వాసులు స్థానిక డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంలో ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డిని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ తండాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి కెసిఆర్ పంచాయతీలుగా మార్చారని గుర్తుచేశారు. బూరుగుపల్లి తండా వాసులు గత కొన్నేళ్లుగా సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారు పడుతున్న అవస్థలను గుర్తించి తండా వరకు తారురోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరి చేసినట్లు తెలిపారు. తారురోడ్డు మార్గం నిర్మాణమైతే తండాలకు మహర్ధశ రానుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి లావణ్యరెడ్డి, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్, నాయకులు లింగారెడ్డితో పాటు బూరుగుపల్లి తండావాసులు పాల్గొన్నారు.