Home అంతర్జాతీయ వార్తలు యుఎస్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్ పెస్, హింగిస్‌లదే

యుఎస్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్ పెస్, హింగిస్‌లదే

paes-and-hingisన్యూయార్క్: యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పెస్ మరోగ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. శుక్రవారం జరిగిన మిక్సడ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టిన హింగిస్‌తో కలిసి టైటిల్ విజేతలుగా నిలిచారు. వీరు అమెరికాకు చెందిన బెథానీ మాటెక్, సాండ్స్ సామ్ క్వెర్రీ జోడిపై గెలిచి టైటిల్ నిలబెట్టుకున్నారు.