Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

గోడలే కాన్వాసులు

Paints

యూరప్‌లోని బ్రిస్టల్ నగర సమీపంలో ఉన్న బెడ్‌మిన్స్‌టర్, సౌత్‌విల్లీ ప్రాంతాలు ప్రతి యేడాది కళకళలాడుతూ కనిపిస్తాయి. ఏ వీధిలోకి వెళ్లినా గోడల నిండా పరుచుకుని ఉన్న భారీ పెయింటింగ్స్ కళ్లు తిప్పుకోనివ్వవు. ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడుతుంటాయి. ప్రతి సంవత్సరం అక్కడి వాళ్లు గ్రాఫిటీ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్‌లో 25 దేశాల నుంచి వచ్చే 300 మంది ఆర్టిస్టులు పాల్గొని ఇంటి గోడనో, షాపు గోడనో, కాంపౌండ్‌వాల్‌నో కాన్వాసుగా మలుచుకుని రంగుల గ్రాఫిటీని ప్రదర్శిస్తారు. 2008 నుంచి ఈ ఫెస్టివల్ క్రమం తప్పకుండా బ్రిస్టల్ వాసులను అలరిస్తోంది. ఒక్కో ఆర్టిస్టు ఎన్నో రోజులు కష్టపడి భారీ పెయింటింగ్స్‌ను వేస్తారు. గ్రాఫిటీలోని మజాను ఆస్వాదించాలంటే ఈ ఫెస్టివల్‌కు వెళ్లాల్సిందే.

Comments

comments