Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పాక్ నటి కాల్చివేత

Pak : Actress Shot dead by Her Husband

ఇస్లామాబాద్ : ప్రముఖ పాక్ నటి, గాయని రేష్మను ఆమె భర్తే కాల్చి చంపాడు. ఈ ఘటన ఖైబర్ పంఖ్తువా జిల్లా పరిధిలోని నౌషెరా ప్రాంతంలో జరిగింది. భర్త ఫైదాఖాన్‌తో గొడవ జరగడంతో రేష్మ పుట్టింట్లో ఉంటుంది. ఆమె భర్త ఫైదాఖాన్ అత్తగారింటికి వచ్చి ఇంటికి రావాల్సిందిగా రేష్మను కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో కోపోద్రిక్తుడైన ఫైదాఖాన్ రేష్మపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. విదేశాల్లో పని చేసిన ఫైదాఖాన్ ఇటీవలే పాక్‌కు తిరిగొచ్చాడు. రేష్మకు పాక్‌లో పాష్ఠో స్టేజీ ఆర్టిస్ట్‌గా మంచి పేరుంది. రేష్మ సోదరుడు ఒబెయిదుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Pak Actress Shot dead by Her Husband

Comments

comments