Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్ (వీడియో)

Pak Army Helicopter Collapsed

ఇస్లామాబాద్ : పాక్‌కు చెందిన ఆర్మీ హెలికాప్టర్ క్వెట్టా ప్రాంతంలో గురువారం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ సైనికుడు చనిపోయాడు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పాక్‌లో తరుచూ హెలికాప్టర్లు కుప్పకూలుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. మేలో శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. గతేడాది అక్టోబర్‌లో మిరేజ్ జెట్ కుప్పకూలిన ఘటనలో పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పైలట్ చనిపోయాడు. గురువారం జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.

Pak Army Helicopter Collapsed

Comments

comments