Home తాజా వార్తలు పాక్ దిష్టిబొమ్మ దహనం

పాక్ దిష్టిబొమ్మ దహనం

ABVP1

హైదరాబాద్ : అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడిని ఖండిస్తూ ఒయు విద్యార్థులు పాక్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎబివిపి ఆధ్వర్యంలో ఒయు ఆర్ట్ కాలేజీ ఎదుట ఈ కార్యక్రమం చేపట్టారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ వైఖరిని తీవ్రంగా ఖండించాలని ఎబివిపి నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాక్ ఉగ్ర చర్యలను అరికట్టడంలో ప్రపంచ దేశాలు ఏకమై, భారత్‌కు మద్దతు ఇవ్వాలని వారు కోరారు.