Search
Wednesday 21 November 2018
  • :
  • :

పాక్ శాంతికాముక దేశం : నవాజ్ షరీఫ్

Nawaz-Sharif

కరాచీ : తమ దేశం శాంతికాముక దేశమని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. తమ దేశ సార్వభౌమత్యానికి ప్రమాదం వాటిల్లితే సహించబోమని ఆయన స్పష్టం చేశారు. భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్‌కు పాక్ ఆర్మీ కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాము శాంతికి ప్రాధాన్యత ఇస్తామని, దాన్ని బలహీనతగా భావించొద్దని ఆయన తెలిపారు. సంఘర్షణ కంటే సహకారాన్ని కోరుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అస్గర్‌ఖాన్ పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.

Comments

comments