Search
Thursday 18 October 2018
  • :
  • :

కిర్రాక్ క్యాచ్.. ఫ్లైయింగ్ జాట్

Superman

దుబాయ్: పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ సూపర్ మ్యాన్ గా మారాడు. మనోడు గాల్లో ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో అందరూ బాబర్ అజమ్ ను సూపర్ మ్యాన్, ఒక్క క్యాచ్ తో హీరో అయ్యావు మ్యాన్, గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టగల నమ్మకం బాబర్ దే నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  దుబాయ్ వేదికగా పాక్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టులో 128 ఓవర్లలో పాకిస్తాన్ బౌలర్ వేసిన బంతిని  మిచెల్ స్టార్క్ షాట్ ఆటబోయాడు. బ్యాట్స్ మెన్ దగ్గరగా ఫీల్డర్ గా నిలబడిన బాబర్ అజమ్ గాల్లోకి ఎగిరి బాల్ ను  అందుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది.  ఈ మ్యాచ్ లో మరో రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా 524 నిమిషాలు (8గంటల 44 నిమిషాలు) పాటు క్రీజులో ఉన్నాడు. అతి ఎక్కువ సమయం క్రీజులో ఉన్న ఆటగాడిగా ఉస్మాన్ రికార్డు నెలకొల్పాడు. ఉస్మాన్ 302 బంతుల్లో 142 పరుగులు చేశాడు.

Pak vs Aus: Pakistan Cricketer Superman Catch

Telangana news

Comments

comments