Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

‘ప్రపంచ బ్యాట్స్‌మెన్లకు కోహ్లీ ఒక బెంచ్ మార్క్’

Pakistan Former Cricketer Shoaib Akhtar Praises Virat Kohli

ఇస్లామాబాద్:  టీమిండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఎడ్జ్ బాస్టన్ లో ఆడిన కెప్టెన్ ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.  ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు కోహ్లీ విరోచిత పోరాటం చేశాడు. 100 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడిన భారత జట్టును విరాట్ అద్భుత ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు. పట్టుదలతో ఆడిన విరాట్ 149 పరుగులు చేసి ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. ఈ ఇన్నింగ్స్ పై ఇప్పటికే పలువురు లెజెండరీ క్రికెటర్లు కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా పాక్ మాజీ క్రికెటర్, రావాల్పిండి స్పీడ్ స్టర్  షోయబ్ అక్తర్ కూడా ఈ జాబితాలో చేరాడు. కోహ్లీని షోయబ్ ఆకాశానికెత్తేశాడు.

“అద్భుతమైన శతకం. గత ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. కానీ ఈ సారి మాత్రం తాను ఎంత గొప్ప ఆటగాడో నిరూపించుకున్నాడు. అతడి పట్టుదల, అంకితభావం చాలా గొప్పవి. ఈ పర్యటనలో కూడా రాణించలేడంటూ అతనిపై వచ్చిన కామెంట్లకు కోహ్లీ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీతో సరైన సమాధానం చెప్పాడు. నన్ను అమితంగా ఆకట్టుకున్నది ఏమిటంటే… టాప్ ఆర్డర్ తో కలసి ఆడుతున్నప్పుడు ఎంత స్ట్రైక్ రేట్ మెయింటెయిన్ చేస్తాడో… లోయర్ ఆర్డర్ తో కలసి ఆడుతున్నప్పుడు కూడా అదే స్టైక్ రేట్ మెయింటెయిన్ చేయడం. ఇది సాధారణ విషయం కాదు. ప్రపంచ బ్యాట్స్ మెన్లు అందరికీ కోహ్లీ ఒక బెంచ్ మార్క్” అంటూ షోయబ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లు కోహ్లీ అభిమానులను ఆనందంలో ముంచెత్తడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Comments

comments