Search
Thursday 15 November 2018
  • :
  • :

తుపాకీ గురిపెట్టి భారతీయురాలిని పెళ్ళాడిన పాకిస్థానీ!

Pakistan-Nikkah

ఇస్లామాబాద్ : తలకు తుపాకీని గురిపెట్టి పాకిస్థాన్ వ్యక్తి తనని బలవంతంగా పెళ్ళి చేసుకున్నాడంటూ ఓ  20 ఏళ్ల భారతీయురాలు పాకిస్థాన్‌లోని భారత హైకమి షన్‌ను ఆశ్రయించింది. తనను తిరిగి భారత్‌కు(మాతృ దేశానికి)  పంపించేయాలని కోరింది. ఉజ్మా అనే  భార తీయ మహిళ తన పాకిస్థానీ భర్త తాహిర్ అలీపై ఇస్లామాబాద్ కోర్టులో వేధిస్తున్నాడు,బెదిరిస్తున్నాడు అన్న కేసును  కూడా దాఖలు చేసింది. పైగా ఆమె తన వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసింది. తనకు తుపాకీ గురి పెట్టి పెట్టి బలవంతంగా తాహీర్ అలీ పెళ్లిచేసుకున్నాడని, తన ఇమ్మిగ్రేషన్ దస్తావేజులు కూడా లాక్కున్నాడని ఆమె ఆరోపించింది. తన ను భద్రంగా భారత్‌కు తిప్పి పంపించేంత వరకు అక్కడి నుంచి కదలనని ఉజ్మా భారత హైకమిషన్‌లోనే కూర్చుండిపోయింది. ఇదిలా ఉండగా ఆ భారతీయు రాలు పాకిస్థాన్‌లోని తన బంధువులను కలుసుకుంటానన్న కారణం చూపి విజిట్ వీసాతో పాకిస్థాన్‌లో ప్రవేశించిందని, పైగా ఆమె పాకిస్థాన్‌లో పెళ్ళి చేసుకునే ఉద్దేశాలున్నాయని పేర్కొనలేదని పాకి స్థానీ అధికారులు చెప్పారు. ‘భారత్‌కు తనను తిప్పి పంపే యాలని ఉజ్మా తమ వద్దకు వచ్చింద ని భారత్ హైకమిషన్ విదేశ వ్యవహారాల మంత్రి త్వ శాఖకు తెలిపిందని’ పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి నఫీజ్ జకరియా ఆది వారం చెప్పారు.  అలీకి ఇదివరకే పెళ్లయిందని, అతడికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారని ఉజ్మా పేర్కొన్నట్లు భారత హైకమిషన్ తెలిపిందని ఆయ న వివరించారు. ఉజ్మా, తాహీర్ అలీలు మలేషియాలో కలుసుకున్న ప్పుడు ప్రేమలో పడ్డారని, ఆమె మే 1 వాఘా సరిహద్దు గుండా పాకిస్థాన్‌కు వెళ్లిందని, మే 3న ఆమెకు అతడితో నిఖా జరిగిందని సమాచారం. కానీ ఆమె శుక్రవారం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లోకి ప్రవేశించాక పరిస్థితు లు మారి పోయాయని కథనం. ఇదిలా ఉండగా అలీ పాకిస్థాన్‌లోని స్థానిక పోలీసుల వద్ద కేసు దాఖలు చేశాడు.

Comments

comments