Home అంతర్జాతీయ వార్తలు ఉగ్రవాదానికి పాక్ పెట్టుబడిదారు!

ఉగ్రవాదానికి పాక్ పెట్టుబడిదారు!

Pakistanవాషింగ్టన్ : ఉగ్రవాదానికి పాక్‌ను పెట్టుబడిదారి దేశంగా ప్రకటించాలని ఇండో-అమెరికన్ పౌరులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అమెరికా సర్కారు అంగీకరించాలంటే లక్ష సంతకాలు కావాలి. ఈ అంశం పాక్ ప్రోత్సాహంతో బలపడిన ఉగ్రవాదం వల్ల ఇబ్బంది పడే దేశాలకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ‘వుయ్ ది పీపుల్’ పేరుతో అమెరికా సర్కారు ప్రారంభించిన ఆన్‌లైన్ పిటిషన్ కార్యక్రమంలో దీనికి ఒక విండో కేటాయిస్తుంది. దీని ద్వారా వారు పిటిషన్ గురించి ప్రచారం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సభ్యుడు, ఉగ్రవాదంపై హౌస్ సబ్‌కమిటీ ఛైర్మన్ టెడ్ పోయ్, మరో కాంగ్రెస్ సభ్యుడు డానా రోహర్బాచర్‌లు ప్రారంభించారు. ఇప్పటికే ఈ మేరకు సిద్ధమైన ఓ బిల్లు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం కోసం సిద్ధంగా ఉంది.