Home జాతీయ వార్తలు ఉగ్ర ఫ్యాక్టరీ పాక్

ఉగ్ర ఫ్యాక్టరీ పాక్

  • దానిది అపసవ్య ప్రయాణం : ఐరాస జనరల్ అసెంబ్లీలో సుష్మాస్వరాజ్

Sushma-Swaraj

న్యూయార్క్: పాకిస్థాన్ ఉగ్రవాద ఉ త్పత్తి కేంద్రంగా మారిందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విమర్శించారు. శనివారం ఐక్యరాజ్య సమితి 72వ సర్వ ప్రతినిధి సభలో సుష్మా ఉద్వేగభరిత అనర్గళ ప్రసం గం సాగింది.  ఉగ్రవాద పెను సవాళ్ల పరిష్కారానికి ప్రపంచ సంస్థ ఐక్యరా జ్య సమితి విశ్వ ప్రయత్నం చేస్తోంద ని, అయితే ఇదే సమయంలో పాకి స్థాన్ అపసవ్య దిశలో వెళ్లుతోందని సుష్మా ఆగ్రహం వ్యక్తం చేశారు. జటి లమై కూర్చున్న టెర్రరిజాన్ని అణచి వేసేందుకు చేస్తున్న యత్నాలకు ఆ టంకం కల్గిస్తున్నది ఎవరో గ్రహించా లని పిలుపు నిచ్చారు. ఈ సందర్భం గా సుష్మా ఇరుగుపొరుగు దేశాలైన భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉన్న స్వా భావిక అంతరాలను ప్రస్తావించారు. ‘మేం విద్యావేత్తలు, వైద్యులు, ఇంజి నీర్లను తయారు చేస్తున్నాం. ప్రతిభ కు పట్టం కడుతున్నాం. ఇండియా ,  ఐఐటిలు, ఐఐఎం, ఐఐఎంస్‌ఎస్‌ల ను రూపొందిస్తోందని మరోవైపు పా కిస్థాన్  ఎల్‌ఇటి, జెఇఎం, హెచ్‌ఎం లను తయారుచేసి వదిలి వేస్తోం దని మండిపడ్డారు. పాకిస్థాన్ ఉగ్ర వాదులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారింది. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐటి సూపర్ పవర్‌గా నిలిచింది. అయితే పాకిస్థాన్ ఉగ్రవాద కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది” అని సుష్మా తమ ఘాటైన హిందీ ప్రసంగంలో తెలిపారు. పాకిస్థానీ రాజకీయ నాయకులకు, పాలకులకు తెలిసింది ఇది ఒక్కటే అన్పిస్తోందని , ఇప్పటికైనా వారు తమను తాము ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని సుష్మా స్పష్టం చేశారు. విజ్ఞతతో వ్యవహరిస్తే మంచిదని ఇది వారికి పాకిస్థాన్‌కు ప్రయోజనం కల్గిస్తుందని హితవు పలికారు. పాపం పాకిస్థాన్ ప్రధానికి సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటనలోని అంశాలు తెలిసినట్లుగా లేదని, అన్ని సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని ఆయా ఒప్పందాల ద్వారా నిర్ణయించారని అయితే అందుకు విరుద్ధంగా దేశ నేతలు వ్యవహరిస్తున్నారని తెలిపారు. పాకిస్థానీ రాజకీయ నాయకులకు కొన్ని విషయాలు గుర్తుంటాయి. అయితే కొన్నింటిని తమకు గుర్తు లేవు అని సునాయాసంగా ప్రకటిస్తుంటారు. తమ వాదనలకు ఇబ్బందికరమైన అంశాలను మరిచిపోయినట్లుగా నటించడంలో వారు దిట్టలుగా నిలుస్తున్నారని తెలిపారు.ఓ వైపు ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్నేహశాంతి హస్తాలు అందించారని అయితే పాకిస్థాన్ ఎందుకు ఈ ప్రతిపాదనకు ముందుకు రాలేదో ఆ దేశ ప్రధాని బదులివ్వాల్సి ఉందన్నారు.
పేదరికంపై పోరులో మేమున్నాం
భారతదేశం పేదరికంపై పోరులో నిమగ్నం అయి ఉందని, అయితే ఇందుకు భిన్నంగా పాకిస్థాన్ ఈ సమస్యను వదిలేసి, కేవలం జగడాలకే ప్రాధాన్యత ఇస్తోందని, భారత్‌పై పోరుకే సమయం వెచ్చిస్తోందని విమర్శించారు. భారతదేశం ఉద్యోగార్థులను ఉద్యోగ ప్రధాతల దిశకు తీసుకువెళ్లుతోందని , అన్ని ఆర్థిక కార్యక్రమాలు పేద సాధికారత కేంద్ర బిందువుగా ఉంటున్నాయని తెలిపారు. హింసాత్మ క చర్యలతో ప్రపంచం అంతా కలవరం చెందుతు న్న దశలో భిన్నంగా ఆలోచించే దేశాల వైఖరి ప్ర మాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 21వ శతాబ్దపు సవాళ్ల పరిష్కారానికి ఐరాస నూతన ప్రధాన కార్యదర్శి చేపడుతున్న పలు కార్యక్రమాలు అభినందనీయం అని సుష్మ కొనియాడారు.
పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉంటాం
ఉగ్రవాద అంశంతో పాటు పర్యావరణ, వాతావరణ మార్పుల సవాళ్లను కూడా భారత విదేశాంగ మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. వాతావరణ మార్పులకట్టడికి సంబంధించి భారతదేశం పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. శాంతి అంటే కేవలం మానవాళి శాంతి ఒక్కటే కాదని మనచుట్టూ ఉండే ప్రకృతి ప్రకోపించకుండా శాంతిగా విలసిల్లాల్సి ఉందని, ఇందుకు సభ్య దేశాలు అన్నీ స్పందించాలని కోరారు. ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ సమావేశం అవుతున్న తరుణంలోనే యాదృచ్ఛికంగా ప్రకృతి మనకు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్లు, భూకంపాలలో మానవాళి తల్లడిల్లుతున్న ఘటనలు మనకు మన కర్తవ్యాలను తెలియచేస్తున్నాయని సుష్మా మెక్సికో భూకంపం ఇర్మా తుపాన్ వంటి ప్రకృతిపరమైన దాడులను ప్రస్తావించారు. ప్రత్యేకించి సంపన్న దేశాలు ఇక్కడ ఓ విషయం ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాలని, వారి ఆర్థిక స్తోమత వనరులను బట్టి పర్యావరణ పరిరక్షణకు, హరిత భద్రతకు సరైన రీతిలో సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు అవకాశం ఉందని , వారి ఈ బాధ్యతాయుత చర్యతోనే భవిష్యత్‌తరాలను కాపాడుకోగలమని, విశ్వానికి నిజమైన నేస్తాలుగా నిలవగలమని తెలియచేసుకోవాలని పరోక్షంగా అమెరికా , రష్యా ఇతర దేశాలకు చురకలు పెట్టారు. ఐరాస వేదిక నుంచి పలు సమస్యలు ఉన్నాయని, నిజానికి ఈ వేదిక అన్ని సమస్యలను గుర్తించలేకపోయిందని వ్యాఖ్యానించారు.