Home అంతర్జాతీయ వార్తలు మేము రెడీ.. భారత్ రెడీయా?: షరీఫ్

మేము రెడీ.. భారత్ రెడీయా?: షరీఫ్

Nawaz-Sharifఇస్లామాబాద్: కశ్మీర్ విషయమై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారంలో తాము భారత్‌కు అన్నీ విధాల సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కశ్మీర్‌లో నెలకొన్న అశాంతి, ఇతర సమస్యలపై చర్చించాలని భారత్‌కు పలుమార్లు ఆహ్వానించిన ప్రయోజనం లేకపోయిందన్నారు. యురీ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడి విషయం ప్రస్తావనకు రాగానే ఆయన దీనిపై భారత్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. అలాగే ఎల్‌ఒసి వద్ద పాక్ బలగాలు ఎలాంటి చొరబాట్లకు యత్నించలేదన్నారు. ప్రస్తుతం షరీఫ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం అజర్ బైజాన్, బాకులో ఉన్నారు.