Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

యుద్ధం కాదు, శాంతి కావాలి : నవాజ్ షరీఫ్

nawaz2ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి శాంతి మంత్రం జపించారు. తమ దేశం యుద్ధానికి వ్యతిరేకమని, శాంతిని కోరుకుంటున్నారని అయన పాకిస్థాన్ పార్లమెంట్‌లో అన్నారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఆ దేశ ఉభయసభల్లో ఆయన మాట్లాడారు. యురి ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే, ఎటువంటి విచారణ నిర్వహించకుండా పాకిస్థాన్‌పై భారత్ ఆరోపణలు చేసిందన్నారు. నియంత్రణ రేఖ వద్ద సర్జికల్ దాడులు, అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకిని చేయాలని భారత్ భావిస్తున్న నేపథ్యంలో నవాజ్ ప్రత్యేకంగా ప్రసంగించారు.
సర్జికల్ దాడులపై కూడా షరీఫ్ స్పందించారు. నియంత్రణ రేఖ వద్ద జరిగిన దాడి వల్ల ఇద్దరు సైనికులు చనిపోయారని, భారత్ చేసిన దాడులను సమర్థవంతంగా తప్పికొట్టామని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొవడానికైనా పాకిస్థాన్ ఆర్మీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Comments

comments