Home తాజా వార్తలు సుష్మా స్వరాజ్‌కు నవాజ్ షరీఫ్ లేఖ

సుష్మా స్వరాజ్‌కు నవాజ్ షరీఫ్ లేఖ

Sushma Swaraj And Nawaz Sharifన్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి సుష్మా సర్వాజ్‌కు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 19న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆమె ప్రస్తుతం ఇంట్లో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ లేఖ రాశారు. ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో సుష్మా ఎయిమ్స్ చికిత్స పొందుతున్నప్పటికీ.. ట్విట్టర్ ద్వారా చురుగ్గా ఉంటూ అవసరమైన వారికి సాయం చేస్తూనే ఉన్నారు.