Home అంతర్జాతీయ వార్తలు పాక్ ప్రధాని షరీఫ్‌కు ఊరట

పాక్ ప్రధాని షరీఫ్‌కు ఊరట

 అవినీతి ఆరోపణలపై సాక్షాధారాలు లేవన్న పాక్ సుప్రీంకోర్టు

nawaz2

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పదవిని గురువారంనాడు సుప్రీంకోర్టు తన తీర్పుతో కాపాడింది. ఆయనను పదవినుంచి తొలగించేందుకు తగిన సాక్ష్యా ధారాలు లేవని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఆయనకు పదవీ గండం తప్పింది. ఆయన కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు సంయుక్త దర్యాప్తు బృం దాన్ని (ఎఐటి) ఏర్పాటు చేస్తూ కోర్టు ఉత్తర్వు చేసింది. షరీఫ్, ఆయన ఇద్దరు కుమారులు -హసన్, హుస్సేన్‌లు జెఐటి ఎదుట హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఫెడరల్ దర్యాప్తు సంస్థ ( ఎప్‌ఐఎ), జాతీయ జవాబుదారీ బ్యూరో ( ఎన్‌ఎబి), పాకిస్థాన్ సెక్యూరిటీ- ఎక్స్ ఛేంజి కమిషన్ ( ఎస్‌ఇసిపి), ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ), మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ) నుంచి అధికారులు ఆ బృం దంలో ఉంటారు. దర్యాప్తు పూర్తికి జెఐటికి రెండు నెలల వ్యవధిని సుప్రీంకోర్టు ఇచ్చింది.

ప్రతి రెండువారాలకు ఒ క సారి ఆ బృందం సుప్రీంకోర్టు బెంచ్‌కి తన నివేదికను సమ ర్పిస్తుంది. దర్యాప్తును 60 రోజులలో పూర్తి చేస్తుంది. ఈ తీర్పునిచ్చిన ఐదుగురు జడ్జీల బెంచ్‌లో న్యాయమూర్తులు అఫ్జల్ ఖాన్, ఆసిఫ్ సయీద్ ఖోసా, గుల్జార్ అహ్మద్, ఇఫాజ్ ఖాన్, అజ్మత్ సయీద్ ఉన్నారు. ముగ్గురు జడ్జిలు మెజారిటీ తీర్పును ఇవ్వగా ఇద్దరు షరీఫ్‌ను తొలగించాలని తీర్పునిచ్చారు. నవంబర్ ౩న మొదలైన ఈ కేసు విచారణ కు ఇంతవరకూ ౩5 దాకా సాగాయి. షరీఫ్ మనీ లాండ రింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై విచారణలు సాగా యి.

1990 దశకంలో రెండు సార్లు ప్రధానిగా ఉన్నప్పుడు లండన్‌లో బాగా ఆస్తులను కొన్నారన్న కేసు అది. గత ఏడాది పనామా పేపర్స్ ఆ ఆస్తులను విదేశీ కంపెనీల పేరి ట కొన్నటు, ఆ కంపెనీలు షరీఫ్ సంతానం పేరిట ఉన్నట్ల్లు ఆరోపించాయి. పాకిస్థాన్ తహరీక్ – ఇ – ఇన్సాఫ్ అధిపతి ఇమ్రాన్ ఖాన్, జమాత్ – ఇ -ఇస్లామీ అధిపతి సిరాజుల్ హక్, షేక్ రషీద్ హమ్మద్ ఈ కేసులో ప్రధాన పిటిషనర్లు. 2016 మే 16న నేషనల్ అసెంబ్లీ ప్రసంగంలో జాతిని తప్పు త్రోవ పట్టించారని ఆయనపై వారు ఆరోపించారు. తన పిల్లల పెట్టుబడి మొత్తాల గురించి అబద్ధాలు చెప్పారని కూడా వారు ఆరోపించారు. ఖతార్ కు డబ్బు ఎలా బదిలీ అయిందో కూడా దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. 547 పేజీల తీర్పులో ఎన్‌ఎబి దర్యాప్తునకు సహకరించలే దని కూడా కోర్టు పేర్కొంది.

రాజీనామాకు ఇమ్రాన్ డిమాండ్: ప్రధాని పదవికి షరీఫ్ రాజీనామా చేయాలని ఇమ్రాన్ ఖాన్ తీర్పు అనంతరం డిమాండ్ చేశారు. సాక్షాధారాలు లేవని మాత్రమే కోర్టు పేర్కొన్నందున పదవిలో కొనసాగే నైతిక హక్కును ఆయన కోల్పొయినట్లు ఖాన్ విమర్శించారు.