Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో మోడీ, షరీఫ్ భేటీ?

అమెరికాలో మోడీ, షరీఫ్ భేటీ?

ఒకే హోటల్‌లో బస
MODIన్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికాలో మరోసారి భేటీ అయ్యే అవకాశాలున్నాయి. బుధవారంనాడు సాయంత్రం మోడీ అమెరికాలోని న్యూయార్క్ చేరుకోనున్నారు. షరీఫ్ 25వ తేదీన సాయంత్రం చేరుకుంటారు. ఇరువురు దేశాధినేతలు న్యూయార్క్‌లోని వాల్డోర్ఫ్ ఆస్టోరియా హోటల్ లో బస చేయడానికి అమెరికా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సంద ర్భంగా మోడీ, షరీఫ్ భేటీ జరిగే అవకాశాలున్నాయని సమాచారం. అధి కారికంగా ప్రకటన చేయనప్పటికీ హోటల్‌లో ఇద్దరు ఏదురుపడే అవ కాశం ఉందని తెలుస్తోంది. కాగా, 25వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ నేత్వత్వంలో సమ్మిళి వృద్ధిపై జరిగే సమా వేశంలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. షరీఫ్ ప్రసంగం 27న ఉంటుంది.