Home అంతర్జాతీయ వార్తలు నావెద్ పాక్ వాడే

నావెద్ పాక్ వాడే

లోక్‌సభలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాదని బుకాయించిన పాకిస్థాన్
లష్కర్ -ఎ-తోయిబా మా చావు కోరుతోంది : ఉగ్రవాది తండ్రి

Naveed_manatelangana copyన్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయడానికి జరుగుతో న్న కుట్రలో భాగమేనని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఉదంపూర్ ఘటనపై లోక్ సభలో గురువారం హోం మంత్రి తమంత తాము గా స్పందించారు. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోకి చొచ్చుకురావడానికి యత్నా లు సాగుతూ వస్తున్నాయని, ఇప్పుడు జరిగిన దాడి కూడా ఈ పరిణామక్రమంలో భాగమేనని తెలిపారు. సజీవంగా పట్టుబడ్డ ఇద్దరు ఉగ్రవాదుల ఇంటరాగేషన్‌లో కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని మంత్రి తెలిపారు. తమ వ్యూహం గురించి ఓ టెర్రరిస్టు వివరాలు తెలియచేసేందుకు సిద్ధపడ్డారని, సీమాంతర ఉగ్రవాదం, వారి లక్షా ల గురించి ఒక్కొక్కటిగా వివరాలు తెలిసివస్తున్నా యని రాజ్‌నాథ్ చెప్పారు. పాకిస్థాన్ నుంచి జమ్మూ కశ్మీర్‌లోకి ఓ పథకం ప్రకారం ఉగ్రవాదు లు ప్రవేశిస్తున్నారని, రాష్ట్రంలోని శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రలో భాగమే ఇదని మంత్రి చెప్పారు. నెల రోజులలో ఐదుసార్లు చొరబాటు యత్నాలు జరిగా యని, ఇందులో నాలుగింటిని భారత సైన్యం తిప్పికొట్టిందని వివరించారు. ఎనిమిది మంది ఉగ్రవాదుల అరెస్టు జరిగిందని, ఉదంపూర్ దాడి సందర్భంగా పట్టుబడ్డ ఉగ్రవాది నావెద్ పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ నివాసి అని, పాకిస్థాన్‌లోని తమ బంధువుల గురించి తెలియచేశాడని వివరిం చారు. ఉగ్రవాదిని ఇంటరాగేషన్ కోసం జమ్మూ కు తీసుకువచ్చారు. ఉగ్రవాద దాడిలో బలి అయి న బిఎస్‌ఎఫ్ జవాన్లను గుర్తించినట్లు, వారు హర్యా నాలోని యమునానగర్‌కు చెందిన రాకీ, జల్పా య్‌గురికి చెందిన సుబేంధు రాయ్ అని వెల్లడయి నట్లు తెలిపారు.
నావెద్ మావాడు కానేకాడు-పాక్ న్యూస్‌వెబ్‌సైట్ వెల్లడి
పాకిస్థాన్ ఉగ్రవాదులపై తన మునుపటి వాదనను విన్పించింది. టెర్రరిస్టు నావెద్ తమ దేశం వాడు కాదని పాకిస్థాన్ న్యూస్‌వెబ్‌సైట్ దునియా న్యూస్ తెలిపింది. ఉదంపూర్ ఉగ్రవాద దాడుల కేసులలో పాకిస్థాన్ పాత్రను తెలిపే ఆధారాలను మహమ్మద్ నావెద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్‌ను పట్టుకోవడం ద్వారా కనుగొన్నామని భారతదేశం పేర్కొంటున్న తరుణంలో పాకిస్థాన్ స్పందన వెలువడింది. ముంబై దాడుల పాత్రధారి కసబ్ విషయంలోనూ పాకిస్థాన్ ఆయన తమ దేశ స్థుడు కాదని పేర్కొన్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు ఈ ఉగ్రవాది విషయంలోనూ తమ దేశం పాత్ర ఏదీ లేదని, నావెద్ తమ పౌరు డు కాదని, ఆయన జాతీయతను తెలిపే వివరాలు ఏవీలేవని దునియా న్యూస్ తెలిపింది. నవీద్ లష్క రే తోయిబా ఉగ్రవాది అని, హిందువులను చంప డం తనకు వినోదం అని ఆయన వ్యాఖ్యానించి నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దునియా న్యూస్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన జాతీయ గణాంకాల నమోదిత కేంద్రం (నాద్రా) నావెద్‌కు తమ దేశంతో ఎలాంటి సంబం ధం లేదని తెలిపింది. తమ రికార్డులలో ఆ వ్యక్తి పేరిట ఏ జాతీయుడు ఉన్నట్లు రికార్డులలో లేదని స్పష్టం చేశారు. ఉదంపూర్‌లో బుధవారం ఇద్దరు మిలిటెంట్లు బిఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. ఈ దాడికి పాకిస్థాన్ కారణ మని, జమ్మూ కశ్మీర్‌లో శాంతిని విచ్ఛిన్నం చేసే చర్యలో భాగంగానే ఈ దాడి జరిగిందని గురు వారం పార్లమెంట్‌లో హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు.

లష్కరే తోయిబా మా చావు కోరుతోంది : ఉగ్రవాది తండ్రి ఆవేదన
బుధవారం జమ్ముకాశ్మీర్ లోయలో సైనిక వాహ నంపై దాడిలో పట్టుబడిన యువకుడి తండ్రిగా భావిస్తున్న మొహమ్మద్ యాకూబ్ తమను లష్కరే తోయిబా, పాక్ సైన్యం వెంటాడుతున్నాయని, తన కుమారుడు ప్రాణాలతో పట్టుబడకూడదని కోరుకు న్నదని హిందూస్థాన్ టైమ్స్‌కు ఫోన్‌లో తెలిపాడు. ‘వారు నన్ను చంపేస్తారు. లష్కరె మమ్మల్ని వెంటా డుతోంది. సైన్యంకూడా మా వెంటపడుతోంది’ అని ఫోన్‌లో క్లుప్తంగా మాట్లాడాడు. తన కుమా రుడు ప్రాణాలతో పట్టుబడకూడదని లష్కరె తోయిబా కోరుకుందని, ఇపుడు అతడు పట్టుబ డడంతో అతని ప్రాణాలకు ప్రమాదం పొంచి వుందని ఆవేదన వ్యక్తంచేశాడు. ఎన్‌కౌంటర్‌లో పట్టుబడిన ఉగ్రవాదికి ఇంటరాగేషన్ సందర్భంగా ఒక ఫోన్‌ను అందజేయగా మొహమ్మద్ నవీద్ చేసిన నంబర్‌నుంచి పైవిధంగా అభ్యర్ధన వినిపిం చింది. ఫోన్‌లో మాట్లాడింది నవీద్ తండ్రిగా భావిస్తున్నారు. ‘నీవు ఇండియానుంచి మాట్లాడుతు న్నావు. మనల్ని చంపేస్తారు’ అని యాకూబ్ భయం వ్యక్తంచేశాడని అధికారులు తెలిపారు. నవీ ద్‌ను వదిలిపెట్టాలని అభ్యర్ధించినట్టు చెప్పారు. ఒక నిమిషం 22 సెకండ్లపాటు సాగిన క్లుప్త సంభాషణ అర్ధరాత్రి 1.22 నిమిషాలకు జరిగినట్టు టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఆ తరువాత ఆ ఫోన్ స్విచాఫ్ చేయబడి ఉందని టైమ్స్ తెలిపింది. నవీద్ తండ్రి అభ్యర్ధనతో ఫైసలాబాద్ సమీపంలోని గులాం మొహమ్మదాబాద్‌కు వెళ్లే ప్రయత్నాన్ని విలేకరులు మానుకున్నట్టు ఆ పత్రిక పేర్కొన్నది.
ఉధంపూర్ ఘటనపై ఎన్‌ఐఎ దర్యాప్తు
ఉధంపూర్ ఉగ్రవాద దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) గురువారం తమ దర్యాప్తును ప్రారంభించింది. పట్టుబడ్డ ఉగ్రవాది నావెద్ తను లష్కరే తోయిబాకు చెందిన రెండు వేర్వేరు శిబి రాలలో శిక్షణను పొందినట్లు వెల్లడించినట్లు చెప్ప డంతో నియా తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇన్‌స్పెక్టర్ జనరల్ సంజీవ్ కుమార్ సింగ్ నాయ కత్వంలోని నియా బృందం ఉధంపూర్‌లోనే బుధ వారం నుంచి మకాం వేసి, ఎదురుకాల్పుల ప్రాం తాన్ని నిశితంగా పర్యవేక్షించిందని, ఇతర వివరా లను ఆరా తీసిందని అధికార వర్గాలు తెలిపాయి. ముంబై దాడుల తరువాత కేంద్ర దర్యాప్తు సంస్థ నియాను ఏర్పాటు చేశారు. ఉదంపూర్‌లోని బిఎస్ ఎఫ్ క్యాంప్ సిబ్బందిని, ధైర్యసాహసాలు ప్రద ర్శించి ఓ ఉగ్రవాదిని పట్టుకున్న గ్రామస్తుల నుంచి నియా వర్గాలు వివరాలను సేకరిస్తాయి. పట్టుబడ్డ తరువాత రాత్రంతా జరిగిన ఇంటరాగేషన్‌లో నావె ద్ చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నట్లు వెల్లడ యింది. తాను దౌర్ ఏ ఆమ్, దౌరా ఏ కాస్ విభా గాల నుంచి శిక్షణ తీసుకున్నట్లు ఈ రెండు కూడా లష్కరే ఆధ్వర్యంలో నడుస్తున్న శిబిరాలని ఉగ్ర వాది చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇం దులో ఓ విభాగం నుంచి తాను శారీరో ధారుఢ్యం గురించి, రెండోదాంట్లో ఆయుధాల వాడకం గురించి విస్తారిత శిక్షణ పొందినట్లు చెప్పాడని వెల్లడించారు.
ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది మృతి
శ్రీనగర్: భద్రతా బలగాలతో హోరాహోరీగా జరి గిన ఎదురుకాల్పుల్లో అనుమానిత లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాది మరణించాడు. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లా కాకపొరా సమీపంలోని ఆస్థాన్ మొహల్లా ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. సా యంత్రం 4గంటల సమయంలో స్థానిక పోలీసు విభాగం స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఒజి) గాలింపు కొనసాగిస్తోంది. ఆ బృందానికి ఉగ్ర వాదులు తారసపడటంతో పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. మిలిటెంట్లు ఒక ఇంట్లో దాక్కు న్నారన్న ముందస్తు సమాచారం మేరకు ఎస్‌ఒజి బృందం అక్కడకు చేరుకుంది. పోలీసులను చూసి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.అయితే, భద్రతా బలగాలు ఎదురుకాల్పులతో మిలిటెంట్లకు సమా ధానమిచ్చారని, తట్టుకోలేని వారు పారిపోతున్న క్రమంలో భద్రతా బలగాలు కాల్పులు జరపగా ఉగ్రవాది మరణించాడని చెప్పారు. మృతిచెందిన మిలిటెంట్‌ను స్థానిక నివాసి తాలిబ్ హుస్సేన్‌షాగా పోలీసులు గుర్తించారని, హుస్సేన్‌షా సహచ రులను పట్టుకునేందుకు కొనసాగిస్తున్న గాలింపు చర్యల్లో ఎస్‌ఒజి పార్టీ, రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది భాగస్వాములైనట్లు ఆయన వివరించారు.