Home తాజా వార్తలు ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి

ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి

PanthersParty

న్యూఢిల్లీ: పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతూ జమ్మూ కశ్మీర్ కు చెందిన ఎన్ పిపి (నేషనల్ పాంథర్ పార్టీ) నేతలు డిమాండ్ చేశారు. శనివారం న్యూఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయం వద్ద ఎన్ పిపి నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ.. పాక్ ఉగ్రవాదులు కశ్మీర్ ను నరకపు కూపంలా మార్చేస్తున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ కాల్పుల నిషేధం ఒప్పందాన్ని ధిక్కరించి కాల్పులకు తెగబడుతోందని అన్నారు. పాక్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలనీ, అందుకు భారత్ తో పాటు అంతర్జాతీయ సమాజం కూడా తెలపాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్నా నిర్వహిస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు.