Home అంతర్జాతీయ వార్తలు నవాజ్ షరీఫ్‌కు కోర్టు నోటీసులు

నవాజ్ షరీఫ్‌కు కోర్టు నోటీసులు

nawazshareefఇస్లామాబాద్ : పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. పనామా పేపర్స్ కుంభకోణంలో నవాజ్‌తో పాటు పలువురికి కోర్టు నోటీసులు జారీ చేసింది. పనామా పేవర్స్‌లో షరీఫ్ ఆస్తుల వివరాలు ఉన్నాయని. ఈ కుంభకోణంలో ఆయన రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడని పాకిస్థాన్‌కి చెందిన తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆగస్ట్ 28న కేసు వేశారు. దీంతో సుప్రీంకోర్టు షరీఫ్‌తో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతానికి ఈ కేసు విచారణను సుప్రీం రెండు వారాల పాటు వాయిదా వేసింది.