Search
Thursday 18 October 2018
  • :
  • :
Latest News

పాక్ లో దారుణం.. నటిని కాల్చి చంపిన భర్త…

Pakistani actress and singer Reshma shot dead

ఇస్లామాబాద్: దాయాది పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ నటి, గాయని రేష్మాపై ఆమె భర్తే కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ సంఘటన నౌషెరా కలాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. రేష్మ త‌న భ‌ర్త‌కి నాలుగో భార్య కాగా వారిద్ద‌రి మ‌ధ్య కొన్నాళ్ళుగా మ‌నస్ప‌ర్ధ‌లు తలెత్తడంతో దూరంగా ఉంటుంది. ఆమె తన సోదరుడితో కలిసి హకీమాబాద్ ప్రాంతంలో నివాసముంటోంది. అయితే అతడు తనకు ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయిన విషయాన్ని దాచి పెట్టి  రేష్మాను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య గత కొంతకాలంగా వాగ్వాదం జరుగుతోంది. అప్పటి నుంచి రేష్మా భర్తకు దూరంగా సోదరుడితో కలిసి ఉంటోంది. దీంతో రెష్మాపై కోపం పెంచుకున్నాడు భర్త. ఇటీవల రెష్మా ఉంటున్న చోటుకి వచ్చిన భ‌ర్త తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో ఆమెపై విచ‌క్షణార‌హితంగా కాల్పులు జ‌రిపి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో రెష్మా అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన భర్త కోసం గాలిస్తున్నారు. కాగా, రేష్మామంచి సింగర్ అని, ఆమె పాడిన పాటలు పాక్ లో బాగా ప్రజాదరణ పొందాయి. గతంలోనూ పాకిస్థాన్ లో పలువురు నటీమణులు, గాయకురాళ్లు హత్యకు గురయ్యారు. పాకిస్థాన్‌లో న‌టీమ‌ణులు హ‌త్య‌కి గురికావ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తుంది. ఇటీవ‌ల ఓ గాయని కూడా అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

Comments

comments