Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

డోప్ టెస్టులో దొరికిన పాక్ స్టార్ క్రికెటర్..!

Pakistani cricketer Ahmed Shehzad fails dope test

ఇస్లామాబాద్: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ డోపింగ్ టెస్టులో దొరికిపోయాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అంతేగాక రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని షెహజాద్‌కు నోటీసులు జారీ చేసింది. పాక్‌లోనే నిర్వహించిన డోపింగ్ పరీక్షలో అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు రుజువైంది. అయితే, మరోసారి నిర్ధారించుకునేందుకు గాను ఇండియాలోని ల్యాబ్‌కు పంపించారు. ఇక్కడ కూడా షెహజాద్ ఉత్ప్రేరకాలు వాడిన్నట్టు తెలిందని పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ పత్రిక పేర్కొంది. దీంతో ఐసిసి నిబంధనల ప్రకారం అతనిపై నిషేధం విధించే అవకాశం ఉంది. ఇక గతంలో కూడా పాక్ క్రికెటర్లు పలువురు ఇలాగే ఉత్ప్రేరకాలు వాడి డోప్ టెస్టులో పట్టుబడిన విషయం తెలిసిందే. లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజా హసన్ ఏకంగా రెండేల్ల నిషేధం ఎదుర్కొనగా, యాసిర్ షా, అబ్దుల్ రహమాన్‌లు కూడా నిషేధాలు ఎదుర్కొన్నారు.

Comments

comments