Home తాజా వార్తలు పాలమూరు రైతన్న బ్రతుకు చిత్రం…

పాలమూరు రైతన్న బ్రతుకు చిత్రం…

Palamooru-farmerమహబూబ్‌నగర్: తిమ్మాజిపేట, మండలంలోని వెంకాయపల్లి గ్రామంలో పత్తి చేలుకు మందు కొట్టడానికి కాడెద్దులు లేకపోవడంతో ఎద్దుల బండిపై పురుగుల మందు కలిపి ఉన్న నీళ్ల ట్యాంకును వేసుకుని మనుషుల సహాయంతో మందు కొట్టడానికి వెళుతున్న దృశ్యం ఆది చూసే వాళ్లకు విచిత్రంగా అనిపించినప్పటికి ఇది పాలమూరు బ్రతుకు చిత్రం. ఈ ఏడు వర్షాకాలం రైతులకు సరైన బరోసా ఇవ్వక పోయినప్పటికి ఆశచావని రైతులు పంటలు సాగు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పత్తి పంటను కాపాడు కోవడానికి రైతు పెట్టిన పెట్టుబడులు చేతికి రావని తెల్సికూడా వేసిన పత్తి పంట కాపాడుకోవడానికి కుటుంభ సభ్యులతో కల్సి రైతు చేస్తున్న భగీరత ప్రయత్నం ఇది.