Home జాతీయ వార్తలు పళని వర్సెస్ విజయన్

పళని వర్సెస్ విజయన్

వరదలపై కేరళ ప్రకటనను తిప్పికొట్టిన తమిళనాడు

Kerala

చెన్నై: ముళ్లపెరియార్ డ్యామ్ నుంచి ఒక్కసారిగా భారీ ప్రమాణంలో నీటిని విడుదల చేయడమూ తమ రాష్ట్రంలో వరదలకు ఒక కారణమని కేరళ ప్రభుత్వం వాదనను తమిళనాడు ప్రభుత్వం తోసిపుచ్చింది. ముళ్లపెరియార్ డ్యామ్‌నుంచి తమిళనాడు ఒక్కసారిగా నీటిని వదిలేయడం వల్లననే తమ రాష్ట్రంలో వరదలు వచ్చాయని కేరళ ప్రభు త్వం గురువారం సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయడం తెలిసిందే.అయితే అది నిజం కాద ని, భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో నిండిపోయిన 80 డ్యామ్‌లనుంచి మిగులు జలాలను ఒకే సారి విడుదల చేయడం వల్లనే కేరళలో పెద్ద ఎత్తున వరదలు సంభవించి భారీ నష్టానికి దారి తీసిందని తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి శుక్రవారం చెన్నైలో విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ‘ వరదల కారణంగా కేరళలో కేవలం ఒక్క ప్రాంతం నష్టపోలేదు.

80 డ్యామ్‌లనుంచి ఒక్కసారిగా భారీ ప్రమాణంలో నీటిని విడుదల చేయడం వల్లనే వరదలు వచ్చాయి. కేరళ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది’ అని పళనిస్వామి అన్నారు. కేరళ ఆరోపిస్తున్నట్లుగా ముళ్లపెరియార్ డ్యామ్‌నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేయలేదని ఆయన చెప్పారు. అంతేకాకుండా కేరళ ప్రభుత్వాన్ని మూడు సార్లు హెచ్చరించామని కూడా పళనిస్వామి స్పష్టం చేశారు. అంతేకాదు కేరళలో వరదలు వచ్చిన వారం రోజులకు ముళ్లపెరియార్ డ్యామ్‌నుంచి నీటిని విడుదల చేయడం జరిగిందని కూడా సిఎం చెప్పారు.

కేరళను భిన్నంగా చూడాలి: సిఎం

తిరువనంతపురం: వరద సహాయం అందించే విషయంలో కేరళను భిన్నంగా చూడాలని, ఎం దుకంటే వరదల వల్ల రాష్ట్రానికి కలిగిన భారీ నష్టాన్ని ఏ రాష్ట్రంతో పోల్చలేమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో విజయన్ ఈ నెల ప్రారంభంనుంచి రాష్ట్రంలో వరదలు, కొండచరియలు విరిగిపడ్డం వల్ల కలిగిన నష్టం వివరాలను వివరిస్తూ, ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ నష్టం దాదాపు రూ.20,000 కోట్లుగా ఉందని, 2018 19 రాష్ట్ర వార్షిక ప్రణాళికకు ఇది సమానమని చెప్పారు.

కేరళలో ఆగస్టు 8నుంచి భారీ వర్షాలు, వరదల కారణంగా 231 మంది ప్రాణాలు కోల్పోయారని, 10.40 లక్షల మందికిపైగా ఇప్ప టికీ పునరావాస శిబిరాల్లో ఉన్నారని ఆయన చెప్పారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని, వేల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. యు ఎఇ, ఖతర్ లాంటి దేశాలు సాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వరద నీరు తగ్గి నష్టాన్ని చివరగా అంచనా వేసినప్పుడు నష్టం మరింత పెరగడం ఖాయమని అంటూ, అందువల్ల వరదల వల్ల తమ రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని మిగతా ఏ రాష్ట్రం తోను పోల్చడానికి వీలు లేదని స్పష్టం చేశారు.