Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మండలి విప్‌గా పల్లా రాజేశ్వర్ రెడ్డి

palla-rajeshwar-reddy

హైదరాబాద్: పల్లా రాజేశ్వర్ రెడ్డిని మండలి విప్‌గా సిఎం కెసిఆర్ నియమించారు. ఈసందర్భంగా శుక్రవారం ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. కెసిఆర్ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. కెసిఆర్‌కు రుణపడి ఉంటానని చెప్పారు. టిఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని మండలి విప్ పల్లా స్పష్టం చేశారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డిని మండలి విప్‌గా నియమించినందుకు సిఎం కెసిఆర్‌కు హోంమంత్రి నాయిని నరసింహ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి స్నేహ శీలి అని కొనియాడారు. పార్టీలో పని చేసిన వారందరికీ సిఎం కెసిఆర్ న్యాయం చేస్తున్నారని నాయిని చెప్పారు.

Comments

comments