Home తాజా వార్తలు తాటి ముంజలు… ప్రయోజనాలెన్నో…

తాటి ముంజలు… ప్రయోజనాలెన్నో…

palm Munjal...The benefits ...

సిరిసిల్ల : తాటి ముంజలు తినే సీజన్ రానే వచ్చింది. అశ్విని కార్తె ప్రారంభం కావడంతో తాటిముంజలను గౌడ కులస్తులు చెట్ల పై నుండి కోసి అందుబాటులోకి తీసుకవస్తారు. వాటిని పట్టుకుంటే జారిపోయే, నోట్లో వేసుకోగానే కరిగిపోయే తియ్యతియ్యని తాటి ముంజలు తినడంతో ఆరోగ్యానికి ఔషదాలుగా ఉపయోగపడుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

అందుబాటులోకి ముంజలు…
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎనగంటి, పెద్దూరు, కొరెం, సుద్దాల, ధర్మారం, అల్మాస్‌పూర్,పదిరె గ్రామాల్లో తాటి ముంజలు దొరకుతున్నాయి. అశ్విన్‌కార్తె ప్రారంభం కావడంతో గౌడ కులస్తులకు ఆరాధ్య దేవుడైనా కాటమయ్యకు నైవేధ్యంగా ముంజలను పెట్టి, తరువాత వాటిని తాటి చెట్ల పై నుంచి దించి, తమ స్నేహితులకు, బంధువులకు, తెలిసిన వారికి అందజేస్తుంటారు. అదేవిధంగా మిగిలిన వాటిని మార్కెట్‌లో రూ. 10లకు రెండు నుంచి మూడు తాటి ముంజలు అమ్ముతున్నారు.

తాటి ముంజలు… ప్రయోజనాలెన్నో…
తాటి ముంజలు ఒంటికి చలువచేస్తాయి. వేసవి తాపం నుంచి ఉప శమనం కలిగిస్తాయి. శరీరానికి సత్వర శక్తినిస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్లు, ఐరన్, కాల్షియం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం ,ఎసిడిటి దూరమవుతాయి. కాలేయ సంబంధ సమస్యలు తగ్గుతాయి. అధిక మొత్తంలో ఉండే పోటాషియం, శరీరంలో ఏర్పడే విషపదార్థాలను తొలగించడంలో సహయపడుతాయి. వివిధ రకాల క్యాన్సర్ కణతులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో ముంజలు ముందంజలో ఉంటాయి. ఈ సీజన్‌లో దొరికే ముంజలను తప్పకుండా తినేందుకు ప్రయత్నించాలనీ వైద్యులు చెబుతున్నారు.

 

palm Munjal…The benefits …