Home రాష్ట్ర వార్తలు పదవులు అనుభవించిన వారే పార్టీ మారుతున్నారు…

పదవులు అనుభవించిన వారే పార్టీ మారుతున్నారు…

palvai-govardhan-reddyమన తెలంగాణ / హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి, మంత్రులుగా ఉండి డబ్బులు సంపాదించిన వారే ఇప్పుడు పార్టీ మారాలని చూస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపి పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో లూటీ చేసిన వారే మళ్ళీ టూల చేసేందుకే టిఆర్ ఎస్‌లోకి వెళ్తున్నారని అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారెవరూ తెలం గాణ ఉద్యమంలో పని చేయలేదని, వారంతా ఉద్యమం చేస్తున్నట్లుగా నటించారన్నారు.