Home బిజినెస్ ‘పాన్’ పరేషాన్

‘పాన్’ పరేషాన్

PAN-CARD4ముంబయి : నగల కొనుగోలులు రూ.2 లక్షలకు మించి తే పాన్ కార్డు సమాచారాన్ని తప్పనిసరి చేయాలన్న ప్ర భుత్వ నిర్ణయాన్ని నగల వ్యాపారుల ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. పెద్ద మొత్తంలో నగదు కొనుగోలులను అదుపుచేసేందుకు, మార్కెట్‌లోకి నల్లధన ప్రవేశాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరి శ్రమలను దెబ్బతీసేదిగానూ, గ్రామీణ ప్రాంతాలకు చెం దిన ప్రజలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయ కుండా ఉండే విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉందని ఆల్ ఇండియా రత్నాలు, ఆభరణాల వర్తక ఫెడరేషన్ (జిజె ఎఫ్), రత్నాలు, ఆభరణాల రంగ జాతీయ వర్తక ఫెడరే షన్‌లు ఆవేదన వ్యక్తం చేశాయి. ‘గ్రామీణ ప్రాంతాలకు చెందిన 70 శాతం మంది రైతులు, సామాన్య ప్రజలు ప న్నుల విభాగంలోకి రారని, వారికి పాన్‌కార్డులు ఉండవ ని ఇటువంటి కొనుగోలుదారులకు ఈ నిబంధన వ్యతి రేకంగా ఉంది. రూ.2 లక్షల విలువైన బులియన్ కొనుగో ళ్లు, రూ.5 లక్షల నగల కొనగోళ్లుపై యథాతథ స్థితిని కొనసాగించాలని, నగల వ్యాపార రంగంలో పాన్‌కార్డు అవసరతను అమలు చేయవద్దని ప్రభుత్వానికి టిసిఎస్‌పై మేము విన్నవిస్తున్నాం’ అని జిజెఎఫ్ చైర్మన్ శ్రీధర్ జివి ఓ ప్రకటనలో తెలిపారు. ‘రత్నాలు, నగల రంగం నల్లధ నాన్ని ప్రోత్సహించదు. నల్లధనం కలిగి ఉన్న వారిని బులియన్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్స హించే విధంగా బంగారు ఉత్పత్తుల అభివృద్ధిపై అదనం గా 15 నుండి 20 శాతం ధరను పెంచడం జరుగు తుంది. ప్రస్తుత రోజులలో ప్రజలు నగలను రోజువారీగా వినియోగించడంలేదని, పండుగలు, మతపరమైన కార్య క్రమాలు, పెళ్లిల సమయాలలోనే బంగారు నగలు వేసు కుంటున్నారు’ అని అన్నారు. ఇదిలా ఉండగా, పాన్‌కా ర్డు తప్పనిసరి అనే నిర్ణయం సరియైనది కాదని, చాలా మంది ప్రజలకు పాన్‌కార్డు లేదని అన్నారు. ఈ నిర్ణయం చట్టప్రకారం అసమంజసమైందని, ఇటువంటి వివక్ష చూపడం సమంజసం కాదని తెలిపారు. భారతదేశంలో పాన్‌కార్డును కలిగి ఉన్నవారు 8 నుండి 10 శాతమే ఉం టారని అన్నారు. రత్నాలు, నగల రంగం నల్లధనానికి అనుకూలం కాదని, నగలలో 80 శాతం పైగా ముడిసరు కే ఉంటుందని, ఉదాహరణకు బంగారం, వెండిలు చట్ట బద్దంగా దిగుమతి చేసుకునేవని జిజెఎఫ్ డైరెక్టర్ బచ్ఛ రాజ్ బమాల్వాఅన్నారు. నగల వ్యాపార రంగం కొను గోలుదారులు పెద్ద షోరూంలకు రావడం చాలా పెద్ద సమస్యగా మారిందని, కొత్త నియంత్రణల కారణంగా మరింత కష్టంగా మారుతుందని మరో డైరెక్టర్ అశోక్ మి నాబాలా తెలిపారు. ఈ నిర్ణయం వల్ల నగల పరిశ్రమకు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని, డబ్బు ఆర్జన పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు తటస్తంగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. భారతదేశంలో 2015 మా ర్చి 31 నాటికి 22.3 కోట్ల పాన్ కార్డులే జారీ అయ్యా యని అన్నారు. భారతదేశ జనాభాలో 89 నుండి 90 శా తం మంది పాన్‌కార్డులు లేకుండా ఉన్నారని, ఈ నిబం ధనను తప్పనిసరిగా పాటించాలన్నది న్యాయంగా ఉం దా అని ప్రశ్నించారు. టైటాన్‌కు 75 శాతం ఆదాయం నగల వ్యాపారం నుండి వస్తుందని, గురువారం ముంబ యి మార్కెట్‌లో వాటా రూ.353.9 పడిపోయింది. ఈ నిర్ణయంతో నగల వ్యాపార రంగంలో నగదు లావాదేవీలు 10 శాతం మేర తగ్గాయని నియంత్రణ సంస్థకు టైటాన్ ఇచ్చిన నివేదికలో పేర్కొంది.