Search
Sunday 23 September 2018
  • :
  • :

పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు

Panchayat elections

జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

మనతెలంగాణ/కరీంనగర్‌: గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు-2018 రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిటర్నింగ్ ఆఫీసర్-1 అధికారుల విధులు గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు గుర్తులు కేటాయించే వరకు పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు ఉంటాయని తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్-1 అధికారుల విధులు ముగిసిన మరుసటి రోజు నుండి ప్రారంభమై ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఉ ంటాయని తెలిపారు.రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాల స్వీకరణను సమయానుసారంగా స్వీకరించాలన,పత్రాల పరిశీలనలో తగిన జా గ్రత్తలు వహించాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వే చ్ఛా వాతావరణంలో నిర్వహించేలా ఆర్వోలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయాలని సూచించారు. గ్రామాలలో శాంతి భద్రతల పరిస్థితిని అంచనా వేయాలని అన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వా రిపై చర్యలకు సిఫారసు చేయాలని సూచించారు.శిక్షణ తరగతులలో జి ల్లా పంచాయితీ అధికారి నారాయణ రావు, కిషన్ స్వామి, తిరుపతి రెడ్డి, రాజేందర్ రెడ్డి, బాలాజి, తిరుపతి,సురేందర్, తదితరలు పాల్గొన్నారు.

Comments

comments