Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

పంచాయతీ కొత్త చట్టం అమలు

TS Ambedkar Overseas Vidya Nidhi Scholarship

 చట్టంలోని 9 అంశాలకు తాత్కాలిక మినహాయింపు

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. ముఖ్యమంత్రి ఆమోదంతో గవర్నర్ గెజిట్ విడుదల చేశారు. ఏప్రిల్ 18వ తేదీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఇది అమల్లోకి వస్తున్నట్లు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ బుధవారం సాయంత్రం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే చట్టంలో పొందుపరిచిన 9 అంశాలను తాత్కాలికంగా అమలు నుంచి మినహాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇవి మినహా చట్టంలోని మిగిలినవన్నీ అమలులోకి వచ్చేసినట్లు పేర్కొన్నారు.
అమలులోకి రాకుండా మినహాయించిన అంశాలు :
1, గ్రామ సభ నిర్వహణకు తప్పనిసరిగా హాజరుకావాల్సిన కనీస సభ్యుల సంఖ్య(కోరం)
2, గ్రామ పంచాయతీ లెక్కలను ఆడిట్ చేయించడంలో విఫలమైనప్పుడు సర్పంచ్, కార్యదర్శిని పదవి నుంచి తొలగించినట్లుగా భావించడం.

3, ప్రభుత్వ ఉత్తర్వును ఉద్దేశ్యపూర్వకంగా వదిలివేసారని, తిరస్కరించారని, తన అధికారాలను దుర్వినియోగం చేశారని, అట్టి వారిని కొనసాగించుట గ్రామంలోని నివాసితులకు హానికరమని భావించినచో సదరు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులని ఆరు నెలల పాటు కలెక్టర్ సస్పెండ్ చేయడం(తాత్కాలికంగా విధుల నుంచి తొలగించే అధికారం).
4. పంచాయతీ కార్యదర్శికి అప్పగించబడిన విధులకు సంబంధించి వారు నిర్వర్తించిన నివేదికను ప్రతీ నెల ప్రజాధికార పరిధిలో ప్రచురించవలెను. ఇందులో ఏమైనా తప్పుగా ప్రచురించినచో పంచాయతీ కార్యదర్శిపై తీసుకునే క్రమశిక్షణ చర్యలు.
5. పంచాయతీ సమావేశాల నిర్ణయాల ప్రతిని, వాటిలో వచ్చిన భిన్నాభిప్రాయాల పత్రమేదైనా ఉంటే దానిని సమావేశం తేది అనంతరం మూడురోజుల్లో పంచాయతీ విస్తరణాధికారికి పంపించడం. పంచాయతీ నోటీస్ బోర్డులో ఉంచడం. తీర్మానాల్లో చట్టం, దాని సంబంధిత విషయాలకు భిన్నంగా ఉన్నట్లయితే వాటిని పంచాయతీ విస్తరణాధికారి జిల్లా కలెక్టర్‌కు నివేదించడం.
6. తెలంగాణ వస్తువుల మరియు సేవల పన్ను చట్టం2017 నిబంధనల కింద ప్రభుత్వంచే గ్రామ పంచాయతీకి జరిపిన చెల్లింపులు.
7. ప్రభుత్వం, దరఖాస్తులు త్వరితగతిన పరిష్కారం కొరకు వివిధ దశలలో లేఅవుట్ ఆమోదానికి ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తు కాలవ్యవధి మరియు సమయానికి ఉద్దేశించిన సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేయడం.
8. భవన నిర్మాణ అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తు, కాల వ్యవధి సమయానికి ఉద్దేశించిన సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేయడం.
9. అప్పీళ్లనే విచారించి నిర్ణయించడం కోసం ఒకటి లేదా అంత కంటే ఎక్కువ సంఖ్యలో గ్రామపంచాయతీ ట్రిబ్యునళ్లను ఏర్పాటుచేయడం.

Comments

comments