Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

జిల్లా అంతటా పంచయతీ ఎన్నికల ఫీవర్..

elaction-faver-image

జిల్లాలో ఊపందుకుంటున్న గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి
పావులు కదుపుతున్న రాజకీయ పార్టీలు
గెలుపు కోసం ముందస్తు ప్రణాళికలు
మద్ధతుదారులతో మంతనాలు… జోరందుకున్న విందు రాజకీయాలు                                                                          సర్వత్రా సిద్ధమైన అధికార యంత్రాంగం … !

మపంచాయితీ ఎన్నికల వేడి జిల్లాలో ఊపం దుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రి యను వేగవంతం చేశారు. ఆయా గ్రామ పంచా యతీలలో ఓటర్ల, తప్పుల సవరణ జరు గుతుంది. ఆయా గ్రామ పంచాయితీలకు కులాల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా త్వరలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఏ గ్రామ పంచా యతీ సర్పంచ్, వార్డు సభ్యులు రిజర్వేషన్లు ప్రకటిస్తే ఎక్కడి నుండి ఎవరూ పోటీ చేయాలో తేలనున్నందున గ్రామ వాతావరణాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి. రాను న్న అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా జరగనున్న ఆయా గ్రామ పంచాయితీలలో గెలిచి తమ స్థానా న్ని, ఉనికిని పటిష్ట పర్చుకొని సత్తా చాటడానికి ఆయా రాజకీయ పార్టీలు సమాయత్తమయ్యాయి. గ్రామ పంచాయ తీలలో అందుకునే గెలుపే తర్వాత శాసనసభ ఎన్నికలలో కూడా ప్రభావం చూపు తున్నందున గ్రామ పంచాయితీలలో గెలిచి శాసన సభ ఎన్ని కలలో గెలవడానికి ఆయా రాజకీయ పార్టీలు ముందుగానే ప్రిస్టేజీగా తీసుకొని దారులు ఏర్పర్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా లో రాజకీయ పార్టీల కదలికలు..కసరత్తులు… వ్యూహా లు..ప్రతి వ్యూహాలు..గెలుపే లక్షంగా సాగనున్న మంతనాలపై ‘మన తెలంగాణ’ ప్రత్యేక కథనం.

మన తెలంగాణ/సూర్యాపేట: గ్రామ పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ నేతల్లో హడావుడి మొదలైంది. సూర్యాపేట జిల్లాలో రాజకీ య వాతావరణం కనబడుతున్నది. పల్లెల్లో నాయకుల జోరు పెరిగింది. రిజర్వేషన్లు ఖారరు కానున్న సర్పంచి పదవిపై తండోపతండాలుగా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ఎన్నికల దిశగా కదులుతున్నది. ఎన్నికల కోసం యం త్రాంగాన్ని సిద్ధం చేశారు. ఈ సీజన్‌లోనే టీఆర్‌ఎస్, కాంగ్రె స్, బిజెపి, టిడిపి, సిపిఎం, సిపిఐ, జనసేన, ఎంఎల్ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. గ్రామాల్లో నాయకులు తరచుగా పాల్గొంటూ పార్టీల అభివృద్ధికి కృషి సల్పు తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు చురుకుగా పాల్గొంటూ పార్టీని బలో పేతం చేసే దిశగా పావులు కదుపు తున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, రైతుబంధు, ఇన్సూరెన్సు వంటి పథకాలతో ప్రభుత్వం ముందుకు దూసుకుపోతున్నది. మంత్రి జగదీశ్‌రెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల్లో కలియతి రుగుతూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ టీఆర్‌ఎస్ శ్రేణులను ఉత్సాహ పరుస్తూ ముందుకు సాగుతున్నారు. కోదాడలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, మాజీ శాసన సభ్యులు వేనేపల్లి చందర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి యెర్నేనిబాబు, డీసీసీబి ఛైర్మన్ ముత్తవరపు పాండురంగారావులు విస్తృ తంగా పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. హుజూర్‌నగర్ నియోజక వర్గంలో పార్టీ ఇన్‌ఛార్జి శంకరమ్మ, పార్టీ నాయకులు శివారెడ్డి, అల్లం ప్రభాకర్ రెడ్డిలు నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీలో ఉత్సా హం నింపుతూ ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కనుసన్నలలో జిల్లాలో కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వవైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి సల్పుతున్నారు. హుజూర్‌నగర్ శాసన సభ్యుడుగా ఉంటూనే రాష్ట్ర బాధ్యతలను మోస్తూ పార్టీ నాయకులను పంచాయితీ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. కోదాడలో ఉత్తమ్ పద్మావతి మండలాల వారిగా సమీక్షలు నిర్వమిస్తూ ఎన్నిక లకు పార్టీ కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. సూర్యాపేట, తుంగ తుర్తిలో మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి అంతా తానై గ్రామాల్లో విస్తృతంగా పర్యటి స్తూ కార్యకర్తలను, నాయకులను కలుపు కుంటూ పంచాయితీ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. బిజెపి నేత సంకినేని వెంకటే శ్వరరావు జిల్లాలో సమస్యలపై ఎలుగెత్తు తూ ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్‌లలో నాయకులలో సమన్వయం చేసుకుంటూ పంచాయితీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. సిపిఎం నాయ కులు ముల్కలపల్లి రాములు, మల్లు నాగార్జున్‌రెడ్డి, మల్లు లక్ష్మీ, పారుపల్లి శేఖర్‌లు గ్రామాల్లో తరచుగా పర్యటిస్తూ పార్టీ వారిని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. తెలంగాణ జన సమితి పార్టీ వారు కూడా జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ కేడర్‌ను తమ పార్టీలోకి చేర్చుకుం టున్నారు. సూర్యపేట జిల్లా కన్వీనర్ కుంట్ల ధర్మార్జున్ పార్టీ బలోపేతానికి ఇతర నాయకులను కలుపుకొని జిల్లా అంత టా విస్తృతంగా పర్యటిస్తున్నారు. సిపిఐ నాయకులు గన్నా చంద్రశేఖర్, దోరెపల్లి శంకర్ జిల్లాలో కార్యక్రమాలను చేప డుతూ, ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ కేడర్‌ను ఎన్నికల కు తయారు చేస్తున్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజా జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీలో కదలిక తెస్తున్నారు. కోదాడలో బొల్లం మల్లయ్యయాదవ్, హుజూ ర్‌నగర్‌లో కిరణ్మయి నియోజకవ ర్గం అంతటా కలియ తిరుగుతూ పంచాయితీ ఎన్నికలకు కార్యకర్తలను రెడీ చేస్తున్నారు. ఎంఎల్ పార్టీ జనసేన పార్టీలు కూడా తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రజా వ్యతిరేక విధా నాలపై తరచుగా విరుచుకపడుతున్నారు. అన్ని పార్టీలు కూడా గ్రామ పంచాయితీ ఎన్నికలకు సిద్ధం అవుతూ గ్రామా ల్లో విస్తృతంగా పర్యటిస్తుండటంతో గ్రామా ల్లో రాజకీయ సందడి నెలకొంటున్నది. చోటా మోటా నాయకులు విం దులు, వినోదాలతో అప్పుడే ప్రచారాలు మొదలు పెట్టడంతో గ్రామాలు రాజకీయ సందడితో కళకళలాడుతున్నాయి.

Comments

comments