Home తాజా వార్తలు ‘పందెం కోడి 2’ ట్రైలర్ అదుర్స్..!

‘పందెం కోడి 2’ ట్రైలర్ అదుర్స్..!

Pandem Kodi 2 Telugu Trailer Released

హైదరాబాద్: 15 ఏళ్ల క్రితం మాస్‌ హీరో విశాల్‌, మీరా జాస్మిన్ హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘పందెం కోడి‘ మూవీ అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్న విశాల్ కి పందెం కోడి విశాల్‌ కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అయింది. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పందెం కోడి 2’ తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ పార్ట్ మాదిరిగానే దీనిలో కూడా హై యాక్షన్ సీక్వెల్స్ ఉన్నాయి. మరోసారి విశాల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీలో లేడీ విలన్ గా నటిస్తోంది వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్. విశాల్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా బాణీలు అందిస్తున్నాడు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై విశాల్‌, ధావల్‌ జయంతిలాల్‌, అక్షయ్‌ జయంతిలాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబ‌ర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.