Search
Sunday 18 November 2018
  • :
  • :

క్యూట్‌గా పందిపిల్ల

pandhi pilla Movie First Look Released

రవిబాబు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘అదుగో’. పంది పిల్ల కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో చెక్క కంచెకు వేలాడుతూ నవ్వుతూ ఉన్న పంది పిల్ల చాలా క్యూట్‌గా అందర్నీ అలరిస్తోంది. రవిబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వర్మ, నభా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్‌ను చూపిస్తున్న సినిమా ఇది. ఇందులో పందిపిల్లను చాలా రియల్‌గా చూపించే ప్రయత్నం చేసింది గ్రాఫిక్స్ టీమ్. షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని దసరా సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. సురేష్ ప్రొడక్షన్ సంస్థలో నిర్మాత డి.సురేష్‌బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఉదయ్‌భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః ఎన్.సుధాకర్ రెడ్డి, సంగీతంః ప్రశాంత్ విహారి, ఎడిటర్‌ః బల్ల సత్యనారాయణ, మాటలుః రవిబాబు, నివాస్, పాటలుః భాస్కరభట్ల.

Comments

comments