Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ఆట మీద దృష్టిపెట్టాలని పాండ్యాకు అభిమానుల చీవాట్లు!

Pandya fans warning scolds to focus on the game

భారత్ ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే… ఇప్పటికే రెండు మ్యాచుల్లో భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత ఆటగాళ్లు సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు ఈ మధ్యకాలంలో అభిమానులు వారిపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు మండిపడ్డారు. భారత జట్టు ఇంగ్లండ్ తో మూడో టెస్ట్ ఆడేందుకు నాటింగ్ హమ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌కు చేరుకుంది. అక్కడికి షికారుకెళ్లిన హార్దిక్ ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

ఈ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నా అని ట్యాగ్ కూడా తగిలించాడు. దీంతో అభిమానులకు కోపం వచ్చింది. అసలే రెండు టెస్టుల్లో చెత్త ప్రదర్శన చేసిన హార్దిక్ పై ఫైర్ అయ్యారు. క్రికెట్ ప్రాక్టీస్ చేయకుండా వీధుల్లో ఈ తిరుగుడు ఏంటని చీవాట్లు పెట్టారు. ‘బీసీసీఐ డబ్బుతో నీ జీవితంలో మొదటి, చివరి యూకే టూర్‌ను బాగా ఎంజాయ్ చెయ్’ అని ఓ నెటిజన్ విమర్శించగా, సోకులపై కాదు ఆటపై దృష్టి పెట్టాలని మరొకరు సూచించారు. మరికొందరైతే.. అక్కడ క్రికెట్ ఆడటానికి వెళ్లావా? లేక ఎంజాయ్ చేయడానికి వెళ్లావా? అని హార్దిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

comments