Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పాండ్యా, కార్తిక్‌కు వరల్డ్ ఎలెవన్‌లో చోటు

pandya

దుబాయి: కరేబియన్ దీవుల్లో గతేడాది హరికేన్ తుఫాన్ల కారణంగా పలు క్రికెట్ స్టేడియాలు నేలమట్టం అయ్యాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌లోని లార్డ్ వేదికగా ఈ నెల 31న ఐసిసి ప్రపంచ ఎలెవన్ జట్టు, వెస్టిండీ జట్టు ఓ ఛారిటీ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే విరాళాలతో తిరిగి ఆ స్టేడియాలను నిర్మించనున్నారు. అయితే వరల్డ్ ఎలెవన్ జట్టుకు భారత్ నుంచి ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, దినేష్ కార్తిక్ ఎంపికైనట్లు ఐసిసి వెల్లడించింది. ఈ జట్టుకు ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించనున్నాడు. తిసారా పెరీరా, షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్, రషీద్ ఖాన్, షోయాబ్ మాలిక్, షాహిద్ అఫ్రిదీ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. మిగతా ఆటగాళ పేర్లను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఐసిసి తెలిపింది. తాజాగా వెస్టిండీస్ జట్టును కూడా ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 13 మంది ఆటగాళ్లుతో కూడిన ఈ జట్టుకు కార్లోస్ బ్రాత్‌వైట్ నాయకత్వం వహించనున్నాడు.

Comments

comments