Home తాజా వార్తలు దూకుడు పెంచిన పన్నీరు

దూకుడు పెంచిన పన్నీరు

Panneer

చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దూకుడు పెంచారు. పన్నీరు సెల్వంతో తమిళనాడు డిజిపి సమావేశమయ్యారు. చిన్నమ్మకు అనుకూలంగా ఉన్న అధికారులపై వేటు వేసే ప్రయత్నం చేశారు. పొయెస్ గార్డెన్‌ను అమ్మ మెమోరియల్‌గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. శశికళ వద్ద ఉన్న ఎంఎల్‌ఎలను తీసుకురావాలని డిజిపికి పన్నీరు ఆదేశించినట్లు సమాచారం. గవర్నర్ విద్యాసాగర్ రావు మధ్యాహ్నం 3.10 గంటలకు చెన్నై చేరుకోనున్నారు.

ఇప్పటి వరకు పన్నీరుకు అనుకూలంగా 40 మంది ఎంఎల్ఎలు ఉన్నట్లు సమాచారం.  పరోక్షంగా డిఎంకె పార్టీ పన్నీరుకు మద్దతిస్తుందని శశికళ వర్గం  ఆరోపణలు చేస్తోంది.