Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

నీకు ధైర్యం ఉంటే బల నిరూపణ చేసుకో: పన్నీరు

paneeru-selvam1

చెన్నై: అమ్మ అడుగుజాడల్లో నడుస్తానని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అన్నాడిఎంకెకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ మాట్లాడలేదని, పార్టీ కార్యకర్తలు కోరితే ముఖ్యమంత్రి పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటానన్నారు. అన్నాడిఎంకె పార్టీ పటిష్టత కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. జయలలిత తనకు దేవతతో సమానమని వెల్లడించారు. జయలలిత మరణంపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకుంటానని పేర్కొన్నారు. శశికళ వర్గానికి ధైర్యం ఉంటే అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని సవాలు విసిరారు. ప్రస్తుత పరిణామాలకు బిజెపికి సంబంధం లేదని ఆయన చెప్పారు. తనకు జయలలిత బంధువుల మద్దతు కూడా ఉందన్నారు.

Comments

comments