Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

21న విజయవాడలో ఆడియో

గోపీచంద్ హీరోగా శ్రీ సత్యసాయి pntm

ఆర్ట్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘పంతం’. గోపీచంద్ 25వ చిత్రమిది. బలుపు, పవర్, జై లవకుశ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేసిన కె.చక్రవర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ “మా సంస్థలో ఏడవ చిత్రమిది. గోపీచంద్ నటిస్తున్న 25వ సినిమా ‘పంతం’ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. నిర్మాణానంతర పనులు వేగంగా జరుగుతున్నాయి. జూలై 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇటీవల యుకె, లండన్, స్కాట్లాండ్‌లో కీలక సన్నివేశాలు, పాటలను చిత్రీకరించాం. ఈనెల 21న విజయవాడలో ఆడియో, 24న వైజాగ్‌లో ఓ ఫంక్షన్ చేస్తాం”అని అన్నారు. దర్శకుడు కె.చక్రవర్తి మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వచ్చింది.  హీరోహీరోయిన్లు గోపీచంద్, మెహరీన్‌లు అద్భుతంగా నటించారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్ పాల్గొన్నారు. పృథ్విరాజ్, జయప్రకాష్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరాః ప్రసాద్ మూరెళ్ల, సంగీతంః గోపీ సుందర్, మాటలుః రమేశ్ రెడ్డి, స్క్రీన్‌ప్లేః కె.చక్రవర్తి, బాబీ.

Comments

comments