Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

సందేశంతో కూడిన కమర్షియల్ సినిమా

gopi

గోపీచంద్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్ పతాకంపై కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘పంతం’. ఈ సినిమా జూలై 5న విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్ మాట్లాడుతూ “దర్శకుడు చక్రవర్తి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రసాద్ మూరెళ్ల, రమేశ్‌రెడ్డి నుండి ఈ కథ నాకు వచ్చింది. మా నాన్నగారు చేసిన సినిమాల తరహాలో ఓ సినిమా చేయాలనుకుంటున్న తరుణంలో నా 25వ సినిమాకు ఇలాంటి కథ కుదరడం ఆనందంగా ఉంది. సందేశంతో కూడిన కమర్షియల్ సినిమా ఇది. పాటలు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్‌తో పాటు సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని నమ్ముతున్నాను”అని అన్నారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ “ట్రైలర్‌లోని డైలాగ్స్ ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది చెబుతున్నాయి. సామాజిక సమస్యను కమర్షియల్ పంథాలో చెప్పడానికి ప్రయత్నించారు. అలా చెప్పడానికి ప్రయత్నించిన సినిమాలన్నీ పెద్ద సక్సెస్‌లయ్యాయి”అని తెలిపారు. కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ “మా బ్యానర్‌లో ఏడో సినిమా ఇది. గోపీచంద్ ప్రతిష్టాత్మక 25వ సినిమాను నిర్మించడం ఆనందంగా ఉంది. చక్రవర్తి కొత్త దర్శకుడు అయినప్పటికీ సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించారు. మెహరీన్‌కు ఐదో సినిమా ఇది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. జూలై 5న సినిమాను విడుదల చేస్తున్నాం”అని పేర్కొన్నారు. దర్శకుడు కె.చక్రవర్తి మాట్లాడుతూ “టీజర్, పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని నమ్మకంగా ఉన్నాం”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెహరీన్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Comments

comments