Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ఘన విజయం దిశగా ‘పంతం’

gopi

గోపీచంద్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్ పతాకంపై కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘పంతం’. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సినిమా సక్సెస్‌మీట్‌లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ “మంచి సినిమా చేశావని అందరూ ప్రశంసిస్తున్నారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. సమాజానికి ఇలాంటి సందేశాలు కావాలి. దర్శకుడు చక్రి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నా కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుంది”అని అన్నారు. నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ “కథ వినగానే గోపీచంద్ అయితే సరిపోతారని ఆయనకు కథ చెప్పడం జరిగింది. ఆయనకు కథ నచ్చడంతో సినిమాను ప్రారంభించాం. ఆయన కోసం ఈ సినిమాను ఇంత గ్రాండ్‌గా నిర్మించాం.  చక్రి కొత్తవాడైనా అనుభవమున్న దర్శకుడిగా సినిమాను తెరకెక్కించారు. మా బ్యానర్ విలువను పెంచే చిత్రమిది”అని తెలిపారు. హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ “ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. గోపీచంద్‌తో పనిచేయడం మరచిపోలేని అనుభవాన్నిచ్చింది”అని పేర్కొన్నారు. దర్శకుడు కె.చక్రవర్తి మాట్లాడుతూ “సినిమాకు అన్ని ఏరియాల నుండి చాలా మంచి స్పందన వస్తోంది. కొత్తవాడినైనా నన్ను నమ్మి అవకాశమిచ్చిన గోపీచంద్, కె.కె.రాధామోహన్‌లకు థాంక్స్‌”అని  తెలిపారు.

Comments

comments