Home సినిమా ‘పేపర్ బాయ్’ ప్రేమ కథ

‘పేపర్ బాయ్’ ప్రేమ కథ

Paper Boy Movie Theatrical Trailer

సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్యా హోప్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పేపర్ బాయ్’. జయశంకర్ దర్శకత్వంలో సంపత్‌నంది, రాములు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమా ట్రైలర్ చూసి అభినందించారు. ఈ కార్యక్రమంలో హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ “సంపత్‌నందితో పనిచేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. హీరోగా నాకు మంచి పేరు తెచ్చే చిత్రమిది. సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది”అని అ న్నారు. దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ “నేను ఎప్పుడైతే కథ విన్నానో వెం టనే దానికి కనెక్ట్ అయిపోయాను. దర్శకుడిగా నాకు అవకాశమిచ్చిన సంపత్‌నందికి ధన్యవాదాలు”అని పేర్కొన్నారు. సంపత్‌నంది మాట్లాడుతూ “సినిమా టీజర్‌కు  36 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ‘పేపర్ బాయ్’ మంచి ప్రేమ కథ. మా సినిమా తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రియా సుమన్, సంగీత దర్శకుడు భీమ్స్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.