Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రైల్వే ప్రయాణికులకు తీపి కబురు…

South-join

హైదరాబాద్ : రైలు ప్రయాణాల్లో రిజర్వేషన్ లేని సాధారణ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యుటిఎస్ మొబైల్ యాప్‌ను దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడారు. జూలై 16 నుంచి ఈ యాప్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో దక్షిణ మధ్య రైల్వే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. సికింద్రాబాద్ పరిధిలో సేవలకు నగదు రహిత చెల్లింపులకు ప్రోత్సాహం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న అన్ని రైల్వేస్టేషన్లకు యుటిఎస్ యాప్ సేవలు అందుబాటులో ఉంటాయని జిఎం పేర్కొన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని ప్రయాణికులకు టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ యాప్ లో ప్లాట్‌ఫాం టికెట్లను కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. సాధారణ టికెట్లను ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.

 

Comments

comments