Home జాతీయ వార్తలు ఆర్మీ చీఫ్ రావత్‌కు పరమ్ విశిష్ట్ సేవా పురస్కారం

ఆర్మీ చీఫ్ రావత్‌కు పరమ్ విశిష్ట్ సేవా పురస్కారం

Army Chief Rawatఢిల్లీ :  రాష్ట్రపతి భవన్ లో గురువారం ఉదయం కీర్తిచక్ర, శౌర్యచక్ర, పరమ్ విశిష్ట్ సేవా పురస్కారాల ప్రదానం జరిగింది. ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌కు పరమ్ విశిష్ట్ సేవా పురస్కారం వరించింది. ఆర్మీ జవాన్ వ్రహ్మపాల్ సింగ్, సిఆర్ పిఎఫ్ జవాన్లు రాజేంద్ర నైన్, రవీంద్ర బబ్బన్, మేజర్ తుషార్ గౌబలకు కీర్తి చక్ర పురస్కారాలు లభించాయి. ఆర్మీ, సిఆర్ పిఎఫ్ కు  చెందిన 12 మంది అధికారులు, జవాన్లకు శౌర్యచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు.

Param Vishisht Seva Award to Army Chief Rawat