Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

తల్లిదండ్రులకు, సమాజానికి కీర్తి ప్రతిష్ట తేవాలి

Parents and society should have a reputation for reputation
కృష్ణవంశి, వినయ్‌లను అభినందించిన స్పీకర్ సిరికొండ

మన తెలంగాణ/భూపాలపల్లి : పిల్లలు ఎదిగి తల్లిదండ్రులకు, సమాజానికి అలాగే దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని తెలంగాణ శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. నేషనల్ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్‌ను గెలుచుకున్న భూపాలపల్లి జిల్లాకు చెందిన కృష్ణ వంశిని,గౌరు వినయ్ లను తెలంగాణ శాసన సభా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో నేషనల్ కిక్ బాక్సింగ్‌లో పాల్గొని పతకాలను సాధించి జిల్లాకు వచ్చిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ పట్టుదల ఉంటే మనిషి ఏమైన సాధించవచ్చని ప్రతి మనిషి ఆత్మవిస్వాసం కలిగి ఉండాలన్నారు. జీవితంలో మనిషికి ఏదో ఒక గోల్ కలిగి ఉండాలని దానికోసం కష్టపడటం కాదు ఇష్టపడి సాధించుకోవలని ఆయన వారికి సూచించారు. చిన్న వయసులో పిల్లలు ఈ చాంపియన్‌షిప్‌ను సాధించడం గర్వించదగిన విషయమని వారు భవిష్యత్‌లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని స్పీకర్ పిల్లలను దీవించాడు. భవిష్యత్లో ఇంకా ఎదుగదలకు నావంతు సహాయ సహకారాలు చేస్తానని వారు అన్నారు. మరిన్ని విజయాలు సాధించి తల్లిదండ్రులకు, సమాజానికి, దేశానికి మంచి పేరుతేవాలని స్పీకర్ ఆకాంక్షించారు.

Comments

comments