Home స్పెషల్ ఆర్టికల్స్ ప్రేమ పెళ్లి చేసుకుందని…!

ప్రేమ పెళ్లి చేసుకుందని…!

Parents Kidnap Daughter due to Love Marriage in Hyderabad

హైదరాబాద్: ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను అత్తవారి ఇంటి నుంచి తల్లిదండ్రులే అపహరించి తీసుకెళ్లిన ఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం  చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుషాయిగూడలోని చక్రీపురంలో ఉండే అరగుల ఆనంద్(25) బోర్‌వెల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆనంద్ గత కొంతకాలంగా కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌కు చెందిన పప్పుల రుచిత(22)ను ప్రేమిస్తున్నాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, రుచిత తల్లిదండ్రులు శ్రీధర్, భవానీ వీరి పెళ్లికి అభ్యంతరం తెలిపారు. దీంతో ఆనంద్, రుచిత ఏప్రిల్ 24న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం తన ఇంటికి తీసుకెళ్లాడు ఆనంద్. అప్పటి రుచిత అత్తవారింట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం వేళ రుచిత తల్లిదండ్రులు మరో ఇద్దరితో కలసి కారులో కుషాయిగూడకు వచ్చారు. ఆనంద్ లేని సమయం చూసి రుచితను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అడ్డగించిన ఆనంద్ తల్లి యాదమ్మను కొట్టారు. ఈ విషయం తల్లి ఆనంద్‌కు చెప్పింది. ఆనంద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.