Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ప్రేమించిందని… కన్నకూతురినే కడతేర్చారు

Murder

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దుద్దేపూడిలో ప్రేమించిందన్న కారణంతో కన్నకుమార్తెను తల్లిదండ్రులు కడతేర్చిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోటమర్తి దీపిక(19) అనే అమ్మాయి అదే గ్రామానికి చెందిన జుంజునూరు వెంకటేశ్వర రావు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. దీపిక ప్రేమ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను పలుమార్లు విచక్షణరహితంగా కొట్టారు. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని దీపిక పట్టుబట్టడంతో తన కూతురిని ఎలాగైనా చంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ అమ్మాయిని చున్నీతో ఊరేసి చంపి… ఆపై తన కూతురు పురుగుల మందు తాగి చనిపోయిందని గ్రామస్థులకు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి తనదైన శైలిలో విచారణ చేపట్టగా నిందితులు ఒప్పుకున్నారు. తమ కూతురు ప్రేమించిందనే కోపంతో ఆమెను చంపానని తల్లిదండ్రులు నిజాలు బయటపెట్టారు. నిందితులు తల్లి లక్ష్మీ, తండ్రి రాంబాబు, నాయనమ్మ చిట్టెమ్మను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Comments

comments