Home లైఫ్ స్టైల్ క్రమశిక్షణలో పెట్టండిలా…

క్రమశిక్షణలో పెట్టండిలా…

Parents-Kids

కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణలో ఉంచేందుకు వారిని కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తుంటారు. ఆపై ఇలా చేస్తే, తమ తప్పేమి లేదని చెప్పుకుంటూ ఉంటారు. కానీ, అది నూటికి నూరుశాతం తప్పు అని చెప్పొచ్చు. కొన్ని దేశాల్లో పిల్లలను కొట్టడం చట్టరీత్యా నేరం కూడా. పిల్లలను చాలా బుద్ధిగా, క్రమశిక్షణగా పెంచడానికి ప్రయత్నించడం మంచిదే. కానీ, కొట్టడం, తిట్టడం కంటే బుజ్జిగిస్తూ, నొప్పించకుండా పిల్లలకు అర్థమయ్యేలా క్రమశిక్షణ ఇవ్వడం చాలా మంచిది. పిల్లలు ఏదైనా చేస్తే, దానివల్ల జరిగే నష్టాలు, లాభాలు గురించి చెప్పాలి. ఉదాహరణకు, ఎండలో ఆడితే జరిగే నష్టాల గురించి చెప్పాలి. అదేవిధంగా,  పిల్లలు ఏదైనా విషయం  చెబుతుంటే తల్లిదండ్రులు శ్రద్ధగా, ఓపికగా వినాలి. ఇలా చేస్తే, మీరు చెప్పే విషయాలను కూడా పిల్లలు ఓపికగా వినే అలవాటును ఏర్పరచుకుంటారు.  పిల్లలు పొరపాట్లు చేస్తే, వారు చేసిన తప్పులు ప్రత్యక్షంగా వారికి తెలిసేలా చేయాలి.  పిల్లలకు భావోద్వేగాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను తల్లిదండ్రులు ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు పిల్లలతో స్నేహంగా ఉండాలి. వారికి వచ్చే అనేక రకాల సందేహాలను తీర్చాలి. ఇలా చేయడం వల్ల పిల్లలను క్రమశిక్షణ కచ్చితంగా అలవడుతుంది.